గొల్లపల్లి మండల అభివృద్ధే ధ్యేయం
గొల్లపల్లి: మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని చందోలి, గొల్లపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గ్రామస్థాయికి పూర్తిగా చేరాలంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
కస్టమర్ చార్జీలు వసూలు చేయండి
కథలాపూర్: వ్యవసాయ మోటార్లకు సంబధించి విద్యుత్ కస్టమర్ చార్జీలను ఈ నెలాఖరులోగా 100 శాతం వసూలు చేయాలని ట్రాన్స్‌కో మెట్‌పల్లి డీఈ మధుసూదన్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. విద్యుత్ బిల్లులు ఏ మేరకు వసూలు చేశారనే విషయాలపై సిబ్బందితో చర్చించారు. మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 57,885 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కస్టమర్ చార్జీలు రూ.2.09 కోట్ల బకా యిలు రావాల్సి ఉందని తెలిపారు. బిల్లుల వసూలులో కథలాపూర్ సెక్షన్ మొదటి స్థానంలో ఉందన్నారు. ఆయన వెంట కథలాపూర్ ఏ ఈ దివాకర్‌రావు, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.
నిర్వాసితులకు పరిహారం పెంచండి
కథలాపూర్: సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్నవారికి పరిహారం పెంచి ఇవ్వాలని బాధిత రైతులు కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి విన్నవించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో తాండ్య్రాల, పోసానిపేట గ్రా మాల భూ నిర్వాసితులతో ఆర్డీవో సమావేశమయ్యారు. రెండు గ్రామాల పరిధిలో 65 ఎకరాలు కోల్పోతున్నామని, ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎకరానికి రూ.10లక్షలు సరిపోవని, మార్కెట్ ప్రకారం చెల్లించాలని రైతులు కోరారు. విషయాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపా రు. తహసీల్దార్ వినోద్, రైతులు పాల్గొన్నారు.
గొల్లపల్లి మండల అభివృద్ధే ధ్యేయం
గొల్లపల్లి మండల అభివృద్ధే ధ్యేయం


