మూడో ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్‌లో పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. 1306 పీవోలు, 1706 ఏపీవోలను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. ఆరు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు బ్యాలెట్‌బాక్స్‌లు, పోలింగ్ బ్యాలెట్లు తరలించామని తెలిపారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ పాల్గొన్నారు.


