
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్‌లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్‌లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు.
ఓదెల తహసీల్ ముట్టడి
ఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్‌షాపు యజ మాని బ్లాక్‌లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్‌లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓదెల: తహసీల్దార్‌తో గోడు
వెల్లబోసుకుంటున్న రైతులు
సిరిసిల్లలో యూరియా కోసం వచ్చిన
తల్లీకూతుళ్లు పడిగె మణెమ్మ, రమ్య
సిరిసిల్లలో క్యూలైన్‌లో కుటుంబ సభ్యులు
ఓదెలలో తహసీల్ ఆఫీస్ ముట్టడి

యూరియా కోసం సకుటుంబ సపరివారం