
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్‌కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది.
– శివగణేశ్, డీఎంఎల్‌టీ స్టూడెంట్, గోదావరిఖని
అమ్మ నేత్రాలను..
రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి.
– కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు

టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి