
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్
కలిసిమెలిసి ఉండేవాళ్లం
మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి.
– లద్దునూరి తిరుపతి, నారాయణపూర్
ఎవరి పనిలో వారు బిజీ
ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది.
– ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట

అప్పుడే బాగుండేది

అప్పుడే బాగుండేది