పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

Jul 4 2025 6:59 AM | Updated on Jul 4 2025 6:59 AM

పాలన

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

మల్లాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో ఎంపీ ల్యాడ్స్‌ రూ.5లక్షలతో బోర్‌వెల్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రోసిడింగ్‌ అందించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్‌ఎస్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ నేరెళ్ల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం

కోరుట్ల: మత సామరస్యానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అయిలాపూర్‌ దర్వాజ వద్ద పీరీలను దర్శించుకున్నారు. మత సామరస్యంతో హిదూ, ముస్లింలు ఈ పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. పులి వేషధారులతో ఫొటోలు దిగారు.

కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ

ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ, డబ్బా గ్రామాల మధ్య లోలెవల్‌ వంతెన స్థానంలో కల్వర్టు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి మంజూరు చేసిన రూ.1.50లక్షల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

ఎంపీ నిధులతో తాగునీటి వసతి

మెట్‌పల్లి: పట్టణంలోని 24వార్డులో ఉన్న మసీదు, 17వార్డు కటిక సంఘ భవనాల వద్ద బోర్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ నిధులు రూ.3లక్షలు బోర్ల ఏర్పాటుకు కేటాయించారని పేర్కొన్నారు.

అంబులెన్స్‌లో పురుడు పోసిన 108 సిబ్బంది

రాయికల్‌: మండలంలోని అల్లీపూర్‌కు చెందిన ఆకుల మౌనికకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. రాయికల్‌ అంబులెన్స్‌ టెక్నీషియన్‌ రామ్‌, పైలట్‌ మల్లారెడ్డి చేరుకుని ఆమెను జగిత్యాలకు తరలించేందుకు సిద్ధపడ్డారు. మార్గంమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డను జగిత్యాలలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు.

ఫీజుల దోపిడీని అరికట్టండి

జగిత్యాలటౌన్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం అన్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఫీజుల నియంత్రణకు డీఎస్‌ఆర్‌సీ సమావేశం ఏర్పాటు చేయాలని, పాఠశాలల అకౌంట్‌ ఆడిట్‌, సొసైటీ ట్రస్టుల ఆడిట్‌లను ఆర్టీవో స్థాయి జుడిషియల్‌ అధికారుల ద్వారా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డుతోపాటు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కోరారు. టీచర్లు, సిబ్బంది వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి సంగెపు ముత్తు, పట్టణ అధ్యక్షుడు దేవుసింగ్‌రాథోడ్‌, జిల్లా కార్యదర్శి సాతారపు పద్మ తదితరులు ఉన్నారు.

పోచమ్మతల్లికి బోనాలు

రాయికల్‌: పట్టణంలోని కేశవనగర్‌లో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో పురవీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు1
1/3

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు2
2/3

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు3
3/3

పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement