
జ్వర బాధితులకు డెంగీ పరీక్షలు నిర్వహించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
రాయికల్: వర్షాకాలంలో జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ వైద్యులను ఆదేశించారు. మండలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను పరిశీలించారు. రాయికల్ ఆస్పత్రిని తని ఖీ చేశారు. రోగుల వార్డులోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులంతా సమయపాలన పాటించాలని సూచించారు. పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోతే జిల్లాకేంద్రం నుంచి తెప్పించుకోవాలని కోరారు. రాయికల్ ఆస్పత్రిలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూపరిండెంట్‌కు సూచించారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఆస్పత్రి సూపరిండెంట్ శశికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
టీబీ చికిత్స అందించాలి
జగిత్యాల: టీబీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. టీబీ ముక్త్‌భారత్ అభియాన్‌లో భాగంగా సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ప్రతిరోజు డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉంటే తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో బాహ్యా ప్రపంచానికి సంబంధాలు తెగి పోయే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నా రు. గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్లు, 336 హ్యాండ్‌పంపులు ఉన్నాయని, 31 వేల ఆయిల్‌బాల్స్ తయారు చేశామని, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.