
ఒక్కసారి నాటితే 30 ఏళ్లవరకు ఆదాయం
జగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం మొక్కలు ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. ఆయిల్ పాం సాగుపై శనివారం జిల్లాకేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మిగతా పంటలతో పోల్చితే చీడపీడల బెడద ఉండదన్నారు. తోటల సాగుకు సబ్సిడీ ఇస్తున్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ఆయిల్ పాం సాగు సాంకేతిక సలహాదారు రంగనాయకులు మాట్లాడుతూ.. ఆయిల్ పాంకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుందని, రానున్న రోజుల్లో మంచి ఆదాయవనరుగా మారుతుందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కూఆ సాగు లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. లోహియా కంపెనీ సీఈఓ సిద్దాంత్ మాట్లాడుతూ.. బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో ఆయిల్ పాం కంపెనీ నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, కోకో పంట రాష్ట్ర ఇన్‌చార్జి మనోజ్‌రెడ్డి, లోహియా కంపెనీ ప్రతినిధులు భరత్, ప్రదీప్ పట్నాయక్, రైతులు పాల్గొన్నారు.