వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌ | - | Sakshi
Sakshi News home page

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

వరికి

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌

● జిల్లాలో 4,431 ఎకరాల్లో పెరుగుతున్న అయిల్‌పామ్‌ మొక్కలు ● ఈ ఏడాది 3,750 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ● నేడు అయిల్‌పామ్‌ సాగుపై జిల్లాస్థాయి సదస్సు ● హాజరుకానున్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, శాస్త్రవేత్తలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ఉ ద్యానశాఖ నిర్ణయించింది. ఈమేరకు రైతుల కు ఆయిల్‌పామ్‌ సాగుపై క్షేత్రస్థాయిలో స మావేశాలు నిర్వహిస్తూ దరఖాస్తులు స్వీకరి స్తున్నారు. ఇటీవల జిల్లాలో సాగు చేసిన ఆ యిల్‌పామ్‌ పంటను ఫ్రాన్స్‌ దేశ ప్రతినిధులు సందర్శించి వెళ్లిన నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ నేతృత్వంలో జగిత్యాలలోని జీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో జిల్లాస్థాయి సద స్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు లోహియా ఎడిబుల్‌ ఆయిల్స్‌ సీఈవో సిద్ధాంత్‌ లోహియా, క్యాడ్బరీ (కోకో కంపెనీ) ప్రతినిధితో పాటు రాష్ట్రంలోని ఆయిల్‌పామ్‌ సాంకేతిక సలహాదారు రంగనాయకులు హాజరుకానున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మంది అభ్యుదయ రైతులను ఆహ్వానిస్తున్నారు.

జిల్లాలో 4,431 ఎకరాల్లో సాగు

జిల్లాలో ఏటా ఆయిల్‌పామ్‌ సాగు పెరుగుతోంది. 2022–23 నుంచి 2024–25 ఇప్పటి వరకు 4,431 ఎకరాల్లో 1,777 రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు రైతులకు ఎకరానికి రూ.4,200 చొప్పున మూడేళ్లలో రూ.4.21 కోట్లు సబ్సిడీ అందించారు. జిల్లా వాతావరణం, నేలలు, సాగునీరు అనుకూలంగా ఉండటంతో మరింత సాగు విస్తీర్ణం పెంచాలంటూ ఉద్యానవన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సాగు వల్ల కలిగే లాభాలు గురించి రైతులకు వివరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే..

జిల్లాలో వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. నూనె గింజలు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో భూగర్భజలాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల జిల్లా వంటి ప్రాంతాల్లో నూనెగింజల పంట అయిన ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఎస్సారెస్పీ, వరదకాల్వలతో జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరిని తగ్గించేందుకు ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని నిర్ణయించింది.

11ఎకరాల్లో సాగు చేశా

నేను 11 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేశా. త్వరగా మొక్కలు ఎదుగుతున్నాయి. అంతరపంటలుగా ఎత్తు తక్కువగా ఉన్న పెసర, పసుపు, సోయాబీన్‌ వంటి పంటలు వేశా. సాగుకు డ్రిప్‌ ద్వారా ఎరువులు, సాగునీరును అందిస్తున్నా.

– కనపర్తి దామోదర్‌రావు,

బొంకూరు, గొల్లపల్లి మండలం

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జిల్లాలో మూడేళ్ల పా టు సాగు చేసిన ఆయిల్‌పామ్‌ తోటలు బాగున్నాయి. ఈ ఏడాది సాగు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తుండటంతో జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

– శ్యాప్రసాద్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌1
1/2

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌2
2/2

వరికి ప్రత్యామ్నయంగా ఆయిల్‌ పామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement