
నేరాల నియంత్రణకు చర్యలు
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్‌లపై పురోగతిపై చర్చించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి అధికారులతో సమీక్షించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని సూచించారు. నేరం జరిగిన స్థలంలో క్లూస్ ఎలా సేకరించాలనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. మూడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు, మరో కేసులో పదేళ్ల జైలుశిక్ష విధించడంలో కృషి చేసిన పీపీ మల్లికార్జున్, అడిషనల్ పీపీ మల్లేశంను ఎస్పీ అభినందించారు. జిల్లాకేంద్రంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనాలను తక్కువ సమయంలో చేధించి దొంగలను పట్టుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్‌ను ఎస్పీ అభినందించారు. గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలీసు అధికారులకు ప్రశంసపత్రాలు అందించారు.
మల్యాల ఎస్సై నరేశ్‌కు అభినందన
మల్యాల: ఎస్సై నరేశ్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. పోలీస్‌స్టేషన్ విధులు, సత్వర కేసుల నమోదు, నేరాల నియంత్రణ, బందోబస్తు నిర్వహణకు గాను ఉత్తమస్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ప్రశంసపత్రం అందించారు.