స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ

Mar 26 2025 12:40 AM | Updated on Mar 26 2025 12:42 AM

మెట్‌పల్లి: పట్టణంలోని పలు స్కానింగ్‌ సెంటర్లల్లో మంగళవారం ఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రతి సెంటర్‌లో లింగ నిర్ధారణ చేయబడదు అనే ఫ్లెక్సీలు ప్రదర్శించాలని సూచించారు. ప్రతి నెలా 5తేదీ లోపు కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్‌ వివరాలు అందించాలని పేర్కొన్నారు. లింగనిర్ధారణ జరిపితే జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. వైద్యుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్నారు. వారి వెంట హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ కటుకం భూమేశ్వర్‌, తరాల శంకర్‌, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం, సూపర్‌వైజర్‌ శ్యామ్‌ ఉన్నారు.

సీసీ కెమెరాలకు మరమ్మతు

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఉన్న సీసీ కెమెరాలను మున్సిపల్‌ ఉద్యోగులు సోమవారం ధ్వంసం చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ముగ్గురు మున్సిపల్‌ ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం సీసీ కెమెరాలకు యుద్ధప్రతిపాదికన మరమ్మతు చేపట్టారు. మరికొన్ని సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన మున్సిపల్‌ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఆయిల్‌ పాం సాగుతో రైతులకు లాభాలు

వెల్గటూర్‌: ఆయిల్‌ పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అఽధికారి భాస్కర్‌ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నా రు. రైతునేస్తం ప్రత్యేకత, వ్యవసాయ యాంత్రీకరణతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయిల్‌ పాం సాగు విధానంలో సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్‌, ఏఈవోలు ఫిర్దోస్‌, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

‘ఎల్‌ఆర్‌ఎస్‌’పై అవగాహన కల్పించాలి

ధర్మపురి: ఎల్‌ఆర్‌ఎస్‌పై చాలామందికి అవగాహన లేదని, ప్రభుత్వం కల్పించిన 25శాతం తగ్గింపును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌.లత అధికారులకు సూచించారు. మండలంలోని తిమ్మాపూర్‌లో మంగళవారం ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్షించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ధర్మపురిలోని ఓ రైస్‌మిల్‌ను సందర్శించి సీఎంఆర్‌ సకాలంలో అప్పగించాలని, లేకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రవీందర్‌ తదితరులున్నారు.

నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

జగిత్యాల: యువత నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ పథకం కింద కోటి మంది యువతకు ఎంపిక చేసుకున్న వ్యాపారరంగంలో ఏడాదిపాటు నైపుణ్య శిక్షణ రూపొందించారని, ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, పెద్దపల్లి జిల్లాల్లోని దాదాపు 200 కంపెనీల్లో నైపుణ్య శిక్షణ పొందేందుకు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు P MI పోర్టల్‌ WWW.P MI NTQ N HIP. MC-A.GO V.I N ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.

స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ1
1/2

స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ

స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ2
2/2

స్కానింగ్‌ సెంటర్లల్లో తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement