ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం

Mar 20 2025 1:52 AM | Updated on Mar 20 2025 1:48 AM

మల్లాపూర్‌: మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఆలయ కమిటీ వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. అర్చకులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ సంగ గంగరాజం, కాంగ్రెస్‌ నాయకులు కల్వకుంట్ల సుజిత్‌రావు, వాకిటి సత్యంరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, తహసీల్దార్‌ వీర్‌సింగ్‌, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఇల్లెందుల తుకారాం, సభ్యులు పాల్గొన్నారు.

నిర్వాసితులు అభ్యంతరాలు ఉంటే తెలపండి

ఇబ్రహీంపట్నం: సదర్‌మాట్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు అభ్యంతరాలు ఉంటే తెలపాలని మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని కోమటికొండాపూర్‌ శివారు గోదావరి కుర్రులో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ పంచాయతీ వద్ద సమావేశమయ్యారు. అభ్యంతరాలు తెలపకుంటే నిర్వాసితులకు ఎంత పరిహారం వస్తుందో వారంరోజుల్లో తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని ఎర్దండి శివారు నల్ల గుట్ట వద్ద గల వివాదాస్పద భూములను పరిశీలించారు. సర్వే నంబర్‌ 104లో 250 మందికి ఒక్కొక్కరికి 180 చదరపు గజాల చొప్పున 1996లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్‌రావు పట్టాలు ఇచ్చారు. ఆ స్థలం తమదేనంటూ బర్ధీపూర్‌ గ్రా మానికి చెందిన సునీల్‌రెడ్డి అభ్యంతరం తెలుపుతున్నారు. ఆ స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో ఎప్పు డు పట్టాలు ఇచ్చారనే వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను త్వరలోనే ప రిష్కరిస్తానని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రసాద్‌, గ్రామ ప్రత్యేక అధికారి రామకృష్ణరా జు, ఆర్‌ఐలు రేవంత్‌రెడ్డి, రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి సరిత , రైతులు పాల్గొన్నారు.

24న అసెంబ్లీని ముట్టడిస్తాం

మల్లాపూర్‌: రైతుల సంక్షేమాన్ని విస్మరించి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న వేలాది రైతులతో అసెంబ్లీని ముట్టడిస్తామని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. మల్లాపూర్‌ మండలకేంద్రంతోపాటు మొగిలిపేట గ్రామాల్లో రైతులను కలిసి మద్దతు కోరారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరసన తెలిపి నినాదాలు చేస్తూ రైతాంగ సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు ప్రభుత్వమంటూ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. రుణమాఫీ కాని వేలాది మంది రైతులు కలెక్టర్‌ వద్దకు వెళ్లి విన్నవించుకుందామంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని విమర్శించారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యలయాల ముందు రైతులు ధర్నా చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పసుపు పంటకు మద్దతుధర, రుణమాఫీ, రైతు భరోసా వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా రైతులు ఈనెల 24న అసెంబ్లీ ముట్టడికి తరలిరావాలని కోరారు. కార్యక్రమాల్లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి, రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షుడు డబ్బా రమేశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు వనతడుపుల నాగరాజు, భూక్య గోవింద్‌నా యక్‌, రైతు సంఘం నాయకులు కాటిపెల్లి ఆది రెడ్డి, కోమ్ముల జీవన్‌రెడ్డి, కాసారపు భూ మారె డ్డి, కళ్లెం మహిపాల్‌రెడ్డి, న్యావనంది లింబా రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బండి లింగస్వామి, పె ద్దిరెడ్డి లక్ష్మణ్‌, ఎలాల జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం
1
1/2

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం
2
2/2

ఘనంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement