వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి

Published Mon, May 27 2024 1:15 AM

వసతుల

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులకు వసతులు కల్పించాలని ఆదివారం కొడిమ్యాల మండల హిందూవాహిని నాయకుల ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్‌ సునీల్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, హనుమాన్‌ పెద్ద జయంతి సమీపిస్తున్నందున భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కోనేరులో నీరు అపరిశుభ్రంగా ఉందని, ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపాలన్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీఐపీలను ఒకేసారి గర్భగుడిలోకి పంపడం ద్వారా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, తదితర సమస్యలపై వినతిపత్రం సమర్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో హిందూవాహిని కొడిమ్యాల మండల అధ్యక్షుడు కొల సురేందర్‌, సభ్యులు ఆకునూరి భార్గవ్‌, మహేందర్‌, వాసు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు విప్‌ ఆది పరామర్శ

మేడిపల్లి(వేములవాడ): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విప్‌ ఆది శ్రీనివాస్‌ పర్యటించారు. కట్లకుంట గ్రామంలో కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్‌ తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. ఇటీవల తొంబరావుపేటలో వడదెబ్బతో మృతిచెందిన బస్వరాజుల లక్ష్మి, ఈదులలింగంపేట గ్రామంలో గోపు పెద్దసాయిరెడ్డి కుటుంబాలను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. అలాగే భీమారం మండలంలో శనివారం గాలివానకు నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. మండల అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, చేపూ రి నాగారాజు, గడ్డం జలందర్‌రెడ్డి, సాయిని గంగారెడ్డి, మాదం వినోద్‌, చుక్క తిరుపతి, బొమ్మెన ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్‌ సిటిజన్స్‌ డిమాండ్లు నెరవేర్చాలి

కోరుట్లటౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్‌ సిటిజన్స్‌ డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కోరుట్ల డివిజన్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కార్యాలయంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టం–2007, నియమావళి 2011పై అసోసియేషన్‌ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. సీనియర్‌ సిటిజన్స్‌ పిలుపు పుస్తకాలను ఆవిష్కరించి ప్రతినిధులకు, సభ్యులకు అందజేశారు. సీనియర్‌ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్‌ అధికారి హన్మంతరెడ్డి, కోరుట్ల డివిజన్‌ అధ్యక్షులు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్‌మోహన్‌, లక్ష్మీనారాయణ, ఎండీ సైఫోద్దీన్‌, రాజయ్య, సాబిద్‌అలీ, లక్ష్మీకాంతం, గంగారాం, శ్రీరాములు, వెంకటేశ్వర్‌రావు, కోరుట్ల కథలాపూర్‌, మేడిపల్లి మండలాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

ఈదురుగాలితో విరిగిపడిన చెట్టు

ధర్మపురి: మండలంలోని నక్కలపేటలో ఆదివారం రాత్రి ఈదురుగాలి, వర్షంతో రోడ్డుపై మూడు చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డుపై విరిగిపడిన చెట్టును గ్రామస్తులు తొలగించారు.

వసతులు కల్పించాలని   హిందూవాహిని వినతి
1/2

వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి

వసతులు కల్పించాలని   హిందూవాహిని వినతి
2/2

వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి

Advertisement
 
Advertisement
 
Advertisement