
కథలాపూర్ : మొలకెత్తిన ధాన్యం చూపిస్తున్న రైతు తరి గంగారాం
జగిత్యాలరూరల్: అకాల వర్షాలతో అన్నదాతలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వడగళ్లవానలతో చేతికందిన పంట నేలకొ రుగుతుండగా ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం సా యంత్రం కూడా జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, కండ్లపల్లి, పొరండ్ల, హన్మాజీపేట, బాలపల్లి, చల్‌గల్, అర్బన్ మండలం ధరూర్, తిప్పన్నపేట, హస్నాబాద్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు కవర్లు కప్పుతూ నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడికాయలు నేలరాలడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వరి, నువ్వు పంటలు నేలకొరగడంతో ఆందోళన చెందుతున్నారు.
వెంటాడుతున్న వర్షం
కథలాపూర్(వేములవాడ): వివిధ గ్రామాల్లో ఆదివా రం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొలకెత్తిన ధాన్యం
మల్యాల(చొప్పదండి): నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం ఆరబోయలేక, రోజుల తరబడి నిల్వ చేయడంతో వర్షపునీరు ధాన్యం కుప్పల కింద చేరుతోంది. దీంతో వడ్లు మొలకెత్తుతున్నాయి. కనీసం తేమశాతం వచ్చిన ధాన్యమైనా తూకం వేయడం ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
జలమయమైన రహదారులు
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని పలుకాలనీల రోడ్లు జలమయమయ్యాయి. అర్ధగంటపాటు కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగాయి. మురుగునీరు రోడ్లపైకి చేరింది. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
రాయికల్(జగిత్యాల): ఒడ్డెలింగాపూర్, చింతలూర్, వస్తాపూర్, ధర్మాజీపేట, తాట్లావాయి, కట్కాపూర్ గ్రామాల్లో కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
జగిత్యాలలో భారీ వర్షం
జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో భారీవర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని ఉన్నా.. సాయంత్రం వరకూ ఎలాంటి వర్షం కురవలేదు. కానీ, రాత్రి 8 గంటలకు వర్షం ప్రారంభమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలి గింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

మెట్‌పల్లి చైతన్యనగర్‌లో జలమయమైన రోడ్డు

చల్‌గల్ మార్కెట్‌లో తడిసిన ధాన్యం

ఒడ్డెలింగాపూర్‌లో తడిసిన ధాన్యం