Mriya Plane Destroyed: World Biggest Plane Mriya AN 225 Destroyed By Russia - Sakshi
Sakshi News home page

‘కల’ను రష్యా కూల్చేసింది, కానీ మా.. : ఉక్రెయిన్‌

Published Mon, Feb 28 2022 7:26 AM

World Biggest Plane Mriya AN 225 Destroyed By Russia - Sakshi

Mriya Plane Destroyed: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ఇంకా ఆగలేదు. ఓవైపు చర్చల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రష్యా సైన్యం, ఉక్రెయిన్‌ సైన్యం-సాధారణ పౌరుల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా కూల్చేసింది. 

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా దళాలు కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ నిన్న(ఆదివారం) రాత్రి  ప్రకటించింది. మ్రియా అంటే అర్థం కల అని. దానిని కూల్చేశారు. కానీ, బలమైన, స్వేచ్ఛా,  ప్రజాస్వామ్యయుతమైన ఉక్రెయిన్ కలను మాత్రం నెరవేరుస్తాం అని అందులో పేర్కొంది ఉక్రెయిన్‌. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో క్యూలెబా ధృవీకరించారు కూడా.

ఇదిలా ఉంటే మ్రియా అంటే కల అనేకాదు.. స్ఫూర్తి అనే అర్థమూ వస్తుంది. అతిపెద్ద ఎయిర్‌లిఫ్ట్‌ కార్గో.. ఆంటోనోవ్‌ డిజైన్‌ బ్యూరో (Antonov An-124) 80వ దశకంలో(సోవియట్‌ యూనియన్‌లో ఉండగానే) డిజైన్‌ చేసింది. 1985లో ఏఎన్‌-225 సిద్ధం కాగా.. మూడేళ్ల తర్వాత కార్యకలాపాలను మొదలుపెట్టింది. నిజానికి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వాటిని మోసుకెళ్లేందుకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. సుమారు 640 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంది ఈ విమానానికి. రష్యా దళాలు ఉక్రెయిన్‌  హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న An-225 ధ్వంసం చేయగా.. శకలానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు బయటకు వచ్చాయి.

Advertisement
Advertisement