కరోనా: మరింత ప్రమాదంలోకి అమెరికా | White House Experts Says US Coronavirus Extraordinarily Widespread | Sakshi
Sakshi News home page

అమెరికాలో విస్తృతంగా వ్యాప్తిస్తోన్న కరోనా..

Aug 3 2020 2:45 PM | Updated on Aug 3 2020 2:59 PM

White House Experts Says US Coronavirus Extraordinarily Widespread - Sakshi

వాషింగ్టన్‌ : కరోనా ఉక్కు పిడికిలిలో చిక్కి అమెరికా విలవిల్లాడుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 4.6 మిలియన్ల మంది కరోనా బారిన పడగా, 1,55,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అగ్ర రాజ్యంలో కరోనా వైరస్‌ ప్రస్తుతం మరో దశలోకి ప్రవేశిస్తోంది. నగరాలతోపాటూ గ్రామీణ ప్రాంతాల్లోనూ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోందని వైట్‌ హౌస్‌ నిపుణులు ఆదివారం పేర్కొన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ను అదుపు చేసేందుకు ప్రతి రాష్ట్రానికి చెందిన గవర్నర్‌లతో కలిసి పనిచేసేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. (ట్రంప్‌కి ఎన్ని కల్లలేనా?)

ఈ మేరకు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్‌ డెబోరా బిర్క్స్‌ మాట్లాడుతూ.. మహమ్మారి విషయంలో మేము మరో దశలోకి వెళుతున్నాము. మార్చి, ఏప్రిల్‌ నెలలో కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికీ వైరస్ నుంచి రక్షణ పొందలేరు. కరోనా వ్యాప్తి అధికమువతున్న ప్రాంతంలో ఉమ్మడి కుటుంబంలో నివసించే ప్రజలు.. వృద్ధులను వైరస్‌ నుంచి తప్పించేందుకు ఇంట్లో సైతం మాస్క్‌ ధరించాలని సూచించారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరిచకుంటే వైరస్‌ మరింత విజృంభిస్తుందని అసిస్టెంట్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అడ్మిరల్ బ్రెట్ గిరోయిర్ తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రంగా, ఆందోళనకరంగా  మారుతోందన్నారు. (అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement