ఇవాంక వర్సెస్‌ మెలానియా.. వీడియో వైరల్‌ | Viral Video Melania Trump Expression After Greeting Ivanka | Sakshi
Sakshi News home page

ముఖం చిట్లించిన మెలానియా.. 5 మిలియన్ల వ్యూస్‌

Aug 28 2020 12:24 PM | Updated on Aug 28 2020 3:23 PM

Viral Video Melania Trump Expression After Greeting Ivanka - Sakshi

వాషింగ్టన్‌: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌(ఆర్‌ఎన్‌సీ) చివరి రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండో సారి ట్రంప్‌ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్‌ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా‌తో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంక.. తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్‌ చేశారు. బదులుగా ప్రథమ మహిళ కూడా చిరునవ్వులు చిందించారు. కానీ సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మూతి ముడుచుకున్నారు మెలానియా. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ప్రథమ మహిళ ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: అవన్నీ ట్రంప్‌ కోతలేనా!)

ఇప్పటికే ఇవాంకకు, మెలానియా ట్రంప్‌కు పడటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మెలానియా తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు. ‘మెలానియా అండ్ మీ’:ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా ఇవాంక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాశారని సమాచారం. మెలానియా ట్రంప్‌కు తెలియకుండా ఆమె స్నేహితురాలు స్టెఫానీ విన్ స్టన్.. మెలానియా వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె ట్రంప్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement