ఓరి దేవుడా! అది బస్సా! ఇంకేదైననా? ఆ స్థితిలో కూడా ఏం రేంజ్‌లో వెళ్తోంది

Viral Video: Bus Through Shoulder Deep Floodwaters In New Zealand - Sakshi

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అకాల భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. చెట్లు, ఇళ్లు కూలిపోవడమే గాక రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడ రోజువారీ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ యంత్రాంగం ఈ పాటికే ముంపుకు గురైన ప్రాంతాలను సర్వే చేయడం, ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానిపై సమీక్షించడం వంటి పనులు ప్రారంభించింది. అలాగే మరోవైపు నగరాలను క్లీన్‌ చేయడం వంటి బాధ్యతలను చేపట్టింది కూడా. అంతేగాదు న్యూజిలాంగ్‌ చరిత్రలో దీన్ని అతి పెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్‌ అవుతున్న ఒక వీడియో అదర్నీ తెగ ఆకర్షించింది. ఈ వీడియోని డెబ్బీ బర్రోస్‌ అనే మహిళ షేర్‌  చేశారు. ఆమె ఆక్లాండ్‌ కౌన్సిల్‌లోని 21 స్థానిక బోర్డులలో ఒకటైన మౌంగాకీకీ టమాకీ స్థానిక బోర్డుకు డిప్యూటి చైర్మన్‌. ఆ వీడియోలో రహాదారిపై నడుమ లోతు వరద నీటితో నిండుగా ఉంది. అక్కడ ఉన్న ఒక కారు కేవలం దానిపై ఉండే రూఫ్‌ మాత్రమే కనిపిస్తోంది. అంత నిండుగా ఉన్న వరద నీళ్లల్లో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది.

అందులో ప్యాసింజర్లు నుంచోని కనిపిస్తున్నారు. అంతేగాదు నీళ్లు ఒకవైపు నుంచి లోపలకు వెళ్తుంటే మరోవైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏదో బోట్‌ మాదిరిగా వెళ్లిపోతుంది. డ్రైవర్‌ కూడా ఏదో ఖాళీ రోడ్డు మీద నడుపుతున్నంత ఈజీగా నడిపేశాడు. దీంతో సదరు డిప్యూటీ చైర్మన్‌ డెబ్బీ బర్రోస్‌ దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నా!.. ఇది నిజమేనా? చాలా తమాషాగా అనిపిస్తోందన్నారు. వాస్తవానికి ఆ రహదారిని మూసేస్తుండగా ఒక బస్సు అదే సమయంలో రయ్యి మంటూ దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు డెబ్బీ బర్రోస్‌. దీంతో నెటిజన్లు చాలా హాస్యస్పదంగా ఉంది, బహుశా ఆ డ్రైవర్‌ డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యవంతుడు కాబోలు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. 

(చదవండి: కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్‌)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top