Viral Video: ప్రారంభోత్సవం రోజునే పరాభవం...హఠాత్తుగా కుప్పకూలిన వంతెన

Viral Video: Bridge In DRC Collapsed During Officials Inauguration - Sakshi

Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్‌ రిపబ్లక్‌ ఆఫ్‌ కాంగో(డీర్‌సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు.

పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్‌ కటింగ్‌ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు.

కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం.

(చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top