Vladimir Putin Assets: పుతిన్‌ ఆస్తుల విలువెంతో తెలుసా? ఆస్తుల్ని ఎలా భద్రపరుస్తున్నాడో తెలుసా?

Ukraine War: US Alliance Eyed On Putin Assets Says UK Website - Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌ పరిణామాల తర్వాత ప్రపంచం మొత్తం ఆయన గురించి తెలుసుకోవాలనే ఆరాటపడుతోంది.  అయితే Putin రాజకీయనేత మాత్రమే కాదు.. ఈ భూమ్మీద అత్యంత సంపద ఉన్న వ్యక్తుల్లో ఒకడు కూడా. ఆ విలువ కొన్ని ప్రపంచదేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువనే ప్రచారం నడుస్తుంటుంది. తాజాగా డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్‌ మెయిల్‌ ఆన్‌లైన్‌ తాజాగా.. పుతిన్ ఆస్తుల మీద ఓ కథనం ఆసక్తికర ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇప్పుడు పుతిన్ ఆస్తులపై కన్నేసినట్లు ఆ కథనం పేర్కొంది. 

పుతిన్ ఆస్తుల విలువపై స్పష్టత కొరవడినప్పటికీ.. ఆయన ఆ ఆస్తుల్ని మొత్తం బినామీల రూపంలో భద్రపరుస్తున్నాడట. కుటుంబ సభ్యుల మొదలు.. చిన్ననాటి స్నేహితులు, కొందరు కేజీబీ సహచరుల పేరిట భద్రపరిచారని ఆ సంచలన కథనం వివరించింది. అంతేకాదు రష్యాలో ప్రతి ఒక్క రూబుల్‌(రష్యా కరెన్సీ)లో.. 50 శాతం వాటాను ఆయన తన బినామీల పేర బదలాయిస్తున్నారని పేర్కొంది.  పుతిన్ మేనల్లుడు, అంతెందుకు పుతిన్ స్నేహితుడి కొడుకు సైతం 500 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండడం మాత్రమే కాదు.. రష్యా ధనికుల లిస్ట్‌లో వాళ్ల పేర్లు ఉండడం గమనార్హం. 

పుతిన్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది మెయిల్‌ ఆన్‌ లైన్‌ కథనం. బినామీల పేరిట విలాసవంతమైన భవనాలు, 700కి పైగా లగ్జరీ కార్లు, 58 విమానాలు ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పుతిన్ కు భవంతులు, కంపెనీలు, వ్యాపారాలు ఉన్నట్టు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని... పుతిన్ తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసినట్టు మెయిల్ ఆన్ లైన్ ఆరోపించింది. పుతిన్‌ అక్రమాస్తులపై ప్రశ్నించినందుకే.. రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కూడా. అంతేకాదు పన్నుల ఎగవేత, రష్యా చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఈ భారీ బినామీ వ్యవహారానికి తెర తీసినట్లు ప్రచురించింది.

ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతంలో పుతిన్ కుమార్తెలు నివసిస్తుండగా, వారి పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఎన్సీఏ భావిస్తోందని మెయిల్ ఆన్ లైన్ పేర్కొంది. అమెరికా.. మిత్ర దేశాలు పుతిన్ బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయని మెయిల్ ఆన్ లైన్ తన కథనంలో పేర్కొంది.  

ఈ బినామీ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, స్తంభింపజేసేందుకు వేట మొదలైందని వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ లోని పుతిన్ బినామీ ఆస్తులపై ఆ దేశ జాతీయ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top