Viral Video: 2-Yr-Old Runs Into Soccer Field During Match In US; Mother Chases Him - Sakshi
Sakshi News home page

VIRAL VIDEO: గ్రౌండ్‌లో ఊహించని పరిణామం! ఘొల్లుమన్న జనం

Aug 13 2021 10:09 AM | Updated on Aug 13 2021 3:33 PM

Toddler Running Into Football Pitch Mother Follows During Match Viral - Sakshi

ఎంతటోడైనా సరే అమ్మ ముందుకు వచ్చేసరికి పసివాడే అవుతాడు. అలాంటిది అమ్మ ముందు వేషాలేస్తే ఊరుకుంటుందా?. సాధారణంగా అభిమానంతోనో లేదంటే నిరసన తోనో కొందరు ఆట జరిగేటప్పుడు మైదానాల్లోకి పరుగులు తీయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడో బుడ్డోడు అల్లరిలో భాగంగా మైదానంలోకి పరుగులు తీశాడు. 

సీరియస్‌గా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా..  రెండున్నరేళ్ల పిలగాడు తల్లి ఒడి నుంచి తప్పించుకుని గ్రౌండ్‌లోకి దూరబోయాడు. ఆటలో పడి పరధ్యానంలోకి వెళ్లిన ఆ తల్లి.. కాసేపటికే కొడుకు ఫెన్సింగ్‌ కింద నుంచి పాకుతూ గ్రౌండ్‌ వైపు పోతున్న సంగతి గుర్తించింది. 

వెంటనే రియాక్ట్‌ అయ్యి ఒక దూకున బారికేడ్‌ దూకి కొడుకు వెంటే గ్రౌండ్‌లోకి  దౌడు తీసింది. ఆ వెంటనే  కొడుకును ఒడిసి పట్టి, సిబ్బంది సహకారం లేకుండానే గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంకేం గ్రౌండ్‌ మొత్తం ఒక్కసారి  ఘొల్లుమని గోల చేసింది.

కట్‌ చేస్తే.. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. సిన్‌సిన్నాటి, ఓర్లాండో మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది.  సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్‌ లీగ్‌ సాకర్‌ ట్విటర్‌ పేజ్‌ ఆ సరదా వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్‌ కార్పెంటర్‌, ఆ తల్లి పేరు మోర్గాన్‌ టక్కర్‌. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement