పైశాచికం: మళ్లీ మొదలైన తాలిబన్ల వికృత చేష్టలు

Talibans Replace Animals With Afghan Prostitution Houses - Sakshi

ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గనిస్థాన్‌ను  ఆక్రమించుకున్న తాలిబన్లు.. అధికారం చేపట్టకున్నా దమనకాండను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్‌లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి.

ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్‌లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు. 

చదవండి: అఫ్గన్‌ సంక్షోభం-హెల్ప్‌లైన్‌ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం

అఫ్గన్‌లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్‌లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్‌, మజర్‌ ఏ షరీఫ్‌, హెరత్‌, జలాలాబాద్‌, జోవ్జాన్‌ ప్రావిన్స్‌లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్‌ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. చదవండి: పదేళ్లు మగాడి వేషంలో..

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్‌ డైరెక్టర్‌ మార్గరేట్‌ స్మిత్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ సెటైర్లు పేల్చారు ఆమె.

చదవండి: షరియా.. ఉల్లంఘిస్తే ఉరే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top