మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! రూ.60 వేల జీతం 12 వేలకు తగ్గింపు.. ఇప్పుడేమో మరో పిడుగు!

Taliban Asked Women Employees In Afghanistan To Send Male Relative To Their Job - Sakshi

కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా  సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు.

'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు.  ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు.

గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్‌ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం)  నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: డెలివరీ బాయ్‌ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top