నెట్‌ఫ్లిక్స్‌ స్క్విడ్‌ గేమ్‌.. డెత్‌ గేమ్‌ సిరీస్‌ గురించి ప్రతీది హాట్‌ టాపికే ఇప్పుడు!

Netflix Squid Game Honeycomb Challenge Viral In Tiktok - Sakshi

Honeycomb Challenge Viral: నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’.. స్ట్రీమింగ్ కంటెంట్‌లో పెనుసంచలనం. కొరియన్‌ డైరక్టర్‌ వాంగ్‌ డోంగ్‌ యుక్‌ డైరెక్షన్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోతోంది. కిందటి నెలలో(సెప్టెంబర్‌ 17న) రిలీజ్‌ అయిన కొరియన్‌ డ్రామా పాజిటివ్‌ రివ్యూలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ కూడా దక్కించుకుంది. పలువురు సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటుండగా, యూత్‌ అడిక్ట్‌ అయిపోతోంది. ఓవరాల్‌గా.. తక్కువ టైంలో మోస్ట్‌ వాచ్డ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌గా నిలిచింది.  

కొందరు కంటెస్టెంట్‌లు, కొన్ని టాస్క్‌లు, వాటిని విజయవంతంగా పూర్తిచేయడం, ఓడిపోతే చావడం, మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్ట్‌లతో  సాగుతుంది ఈ డ్రామా.  డబ్బు ఎరగా వేసి కంటెస్టెంట్‌లతో కొన్ని గేమ్స్‌(చిన్నపిల్లల గేమ్స్‌లా ఉంటాయి) ఆడిస్తారు. అందులో ఓడిపోతే కంటెస్టెంట్‌ ప్రాణం తీసేస్తారు. ‘బతుకు పందెం’ కాన్సెప్ట్‌లతో ఇదివరకే బోలెడు సినిమాలు వచ్చినా.. ఎంగేజింగ్‌గా, క్రేజీగా ఉండడం వల్ల స్క్విడ్‌ గేమ్‌కి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు రకరకాల కారణాలతో Squid Game Netflix సిరీస్‌ వార్తల్లో నిలుస్తోంది. 

హనీకాంబ్‌ ఛాలెంజ్‌
స్క్విడ్‌ గేమ్‌ ఛాలెంజ్‌ అంటే.. షుగర్‌ హనీకాంబ్‌. కొరియా పిల్లల ఆట ‘సియోల్‌టాంగ్‌ బోంప్కి’ స్ఫూర్తితో ఈ గేమ్‌ను రూపొందించారు(ఈ సిరీస్‌లో అన్నీ కొరియన్‌ పిల్లల గేమ్స్‌). తేనే, చక్కెరతో సన్నని పొరలా తయారుచేసే ఈ స్వీట్‌ను మధ్యలో ఒక షేప్‌కి తీసుకొస్తారు. ఈ స్వీట్‌ను స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌లో డగ్లోనా(కరోనా టైంలో పాపులర్‌ అయిన కొరియన్‌ కాఫీ పేరు) అని పిలుస్తారు. ఆ షేప్‌ను సన్నని బ్లేడ్‌తో తెగకుండా కట్‌ చేయాలి. ఒకవేళ ఆ షేప్‌ గనుక బ్రేక్‌ అయితే అంతే!. వెబ్‌ సిరీస్‌లో అయితే చంపేస్తారు. కానీ, షార్ట్‌ వీడియో యాప్స్‌లో ట్రెండ్‌ అవుతున్న ఈ ఛాలెంజ్‌లో మాత్రం సరదాగా శిక్షిస్తారు.

విశేషం ఏంటంటే.. గతంలో వచ్చిన ‘కీకీ’, ‘ఐస్‌ బకెట్‌’ లాంటి ఛాలెంజ్‌ల రికార్డును ఇది కేవలం నెల వ్యవధిలోనే బద్దలు(రికార్డు స్థాయి హ్యాష్‌ట్యాగ్‌లతో) కొట్టడం. ఇక ఈ వెబ్‌ సిరీస్‌లో కాంగ్‌సయే బైయోక్‌ క్యారెక్టర్‌ వేసింది నటి జంగ్‌ హో యోవాన్‌. స్క్విడ్‌ గేమ్‌ ఈమె తొలి సిరీస్‌.

అయినప్పటికీ ఇక్కడ దక్కిన క్రేజ్‌తో సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌(ఫ్యాన్‌) పెంచేసుకుంది. ఇక  సిరీస్‌లో ఆమె అలవోకగా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేస్తుంది. కానీ, అందుకోసం పదుల సంఖ్యలో టేక్‌లు తీసుకుందట ఈ అమ్మడు.

  

నెంబర్ల గొడవ
ఈ సిరీస్‌లో గేమ్‌ సీన్లలో ఫోన్‌ నెంబర్లు ఓపెన్‌గా చూపిస్తారు. ఇప్పుడు ఆ నెంబర్లకు విపరీతంగా కాల్స్‌, మెసేజ్‌లు వెళ్తున్నాయట. దీనిపై సదరు వ్యక్తులు ఫిర్యాదులు చేయడంతో నెట్‌ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రస్తుతం ఆ నెంబర్లను ఎడిట్‌ చేసి చూపిస్తోంది ఇప్పుడు. మరోవైపు ఈ కొరియన్‌ డ్రామా సబ్‌ టైటిల్స్‌ వల్ల డైలాగులకు అర్థాలు మారిపోతున్నాయట. దీంతో వాటిని సైతం మార్చే ప్రయత్నంలో ఉంది నెట్‌ఫ్లిక్స్‌. ప్రస్తుతం స్టోరీ దగ్గరి నుంచి క్యారెక్టర్లు, నటన, టెక్నికల్‌ అంశాలు.. స్క్విడ్‌ గేమ్‌కు సంబంధించిన ప్రతీది హాట్‌ టాపిక్‌గానే మారింది. 

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ స్క్విడ్‌గేమ్‌.. అమెజాన్‌ బాస్‌ రివ్యూ ఇది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top