తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్‌... ఆందోళనలో శాస్త్రవేత్తలు

Microplastics Found Human Breast Milk Italian Scientists Warned - Sakshi

తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్‌ని గుర్తించింది ఇటాలియన్‌ పరిశోధక బృందం. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా ఈ పాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లిపై పరీక్షలు నిర్వహించగా ఆమె పాలల్లో ప్లాస్టిక్‌ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ పాల వల్ల ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు.

ఈ విషయమై త్వరితగతిన పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించాం అన్నారు. అవన్నీ ల్యాబ్‌లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు.  శాస్త్రవేత్తల పరిశోధనల్లో... గర్భిణి మహిళ  గర్భధారణ సమయంలో ప్లాస్టిక్‌ వాటిల్లో  సర్వ్‌ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు.

అలాగే తీసుకునే ఆహారం  విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్‌ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు సీ ఫుడ్‌ తీసుకునేటప్పుడూ, పాలు తీసుకునేటప్పుడూ కాస్త జాగురకతతో ఉండాలని అన్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాల కంటే తల్లి పాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యుడు నోటార్‌స్టెషానో  చెబుతున్నారు.

అంతేగాదు కాలుష్యాన్ని నియంత్రించే చట్టాలను ప్రోత్సహించేలా రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అలాగాని పిల్లలకు బాటిల్‌ పాలను అలవాటు చేయడం మంచిద కాదని, పైగా దానివల్ల వారు మరింత ప్లాస్టిక్‌ వారి నోటిలోకి డైరెక్ట్‌గా వెళ్లే ప్రమాదం ఎక్కువ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్‌  చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్‌ పేస్ట్‌లు, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణి స్త్రీలకు శాస్త్రవేత్తలు సలహలు, సూచనలు ఇస్తున్నారు. 

(చదవండి: 7 ఖండాలు కాదు ఏక ఖండమే..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top