సాస్‌ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి

Man Issues Bomb Threat Restaurant Not Providing Sauce With Chicken Nuggets - Sakshi

ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్‌ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్‌ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల​ అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్‌కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్‌ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్‌ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్‌ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్‌ను అరెస్టు చేశారు.
చదవండి: వాంటెడ్‌ క్రిమినల్‌గా ‘మార్క్‌ జుకర్‌బర్గ్‌’.. పట్టిస్తే రూ.22కోట్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top