స్నేక్‌ అటెంప్ట్‌ మర్డర్‌ అంటే ఇదేనేమో?

I Watch Snake Attempt Murder, A Person Quipped - Sakshi

A Person Runs At Top Speed After Being Startled By Snake: పాములు పగబట్టి చంపేస్తేయంటూ కథలు కథలుగా... మనం చిన్పప్పుడు వింటుండే వాళ్లం. మహా అయితే సినిమాల్లో చూసి ఉంటాం. నిజంగా అయితే ఎవ్వరికీ పెద్దగా తెలియదు. పైగా మనం  అవన్నీ ఉత్తుత్తి మాటలేనని, మూడనమ్మకాలని  కొట్టి పారేస్తాం కూడా. కానీ నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూశాక నమ్మకుండా ఉండలేం. ఇంతకీ ఆ కథ ఏంటో  చూసేద్దాం...

పాములును చూస్తేనే ఒక రకమైన భయంతోపాటు శరీరం ఒక రకమైన గగ్గురపాటుకు గురవుతోంది. అలాంటిది ఒక పాము టేబుల్‌ పక్కన దాక్కుని మరి వెంటపడి దాడి చేస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. ఊహిస్తేనే భయంగా అనిపిస్తోంది కదా. సరిగ్గా అలాంటి ఘటనే థాయ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లోని ఒక ఇంటిలోని మేడ పై చక్కటి డైనింగ్‌ టేబుల్‌ రెండు కుర్చిలతో చాలా పరిశుభ్రంగా అందంగా అలకరించి ఉంది.

(చదవండి: "ఇది మా తప్పిదమే" )

ఈ క్రమంలో ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి టేబుల్‌ దగ్గరకి వచ్చి టేబుల్‌ మీద ఉన్న వాటిని సర్థుతుంటాడు ఇంతలో ఒక పాము హఠాత్తుగా అతని మీదకు ఉరుకుతుంది. దీంతో సదరు వ్యక్తి వెంటనే అప్రమత్తమై పరుగెడతాడు. అయినా సరే పాము మాత్రం ఆ వ్యక్తిని వదలకుండా చాలా కోపంగా వెంబడిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు... పాములు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయని ఒకరు, అన్నా ఏం చేశావు అంతలా పాము నిన్ను పగబెట్టిందేంటి ? అంటూ రకరకాల కామెంట్లతో ట్వీట్‌ చేస్తున్నారు.

(చదవండి: 1990లలో తీసిన క్యాడ్‌బరీ యాడ్‌ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top