ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది? | Sakshi
Sakshi News home page

Israeli Flag: ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి?

Published Mon, Oct 16 2023 8:00 AM

Connection of the Blue Star in the Israeli Flag - Sakshi

ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు.

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్‌తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. 

ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు.

భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్‌ పట్టుకున్న డాలు అని చెబుతారు. 
ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు?

Advertisement
Advertisement