విజృంభిస్తున్న కేసులు... జీరో కోవిడ్‌ పాలసీని వదలనంటున్న చైనా!

Beijing Facing Explosive Covid-19 Outbreak At Mass Testing - Sakshi

Xi Jinping has doubled down on a zero-Covid policy: చైనా ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారీ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటుంది. అయినా కరోనా కేసులు తగ్గాయని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోనని చైనా ఆంక్షలు విధించింది కూడా. ప్రజలు లాక్‌డౌన్‌ వద్దని గగ్గోలు పెట్టినా ముందు జాగ్రత్త చర్యలు అంటూ ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ఐసోలేషన్‌లో ఉంచింది. ఆఖరికి చైనా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి మాత్రం చైనాని ఒక పట్టాన వదలడం లేదు.

చైనా అమలు చేస్తున్న కఠినమైన జీరో కోవిడ్‌ పాలసీ విధానాన్ని బ్రేక్‌ చేస్తూ...కరోనా మహమ్మరి విజృంభిస్తూనే ఉంది. గత కొద్దివారాల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చైనా యంత్రాంగం అందరికీ సాముహిక కరోనా టెస్టులు నిర్వహించింది. ఈ పరీక్షల్లో చైనాకి ఊహించని ఝలక్‌ ఇచ్చింది కరోనా. శుక్రవారం ఒక్క రోజులో చైనా రాజధాని బీజింగ్‌లో 61 కొత్త కేసులు నమోదవ్వగ... శనివారం నాటికల్లా బీజింగ్‌లో మరో 46 కొత్త కేసులు వెలుగు చూశాయని  చైనా అధికారులు తెలిపారు.

ఐతే ఇప్పటి వరకు మొత్తం 115 కేసులు వెలుగు చూశాయని చైనా తెలిపింది. పైగా ఈ బాధితులంతా బీజింగ్‌లోని ఒక బార్‌కి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు ఆ బార్‌కి వచ్చిన మరో 6,158కి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చైనా యంత్రాంగం పేర్కొంది. ఏదిఏమైనా చైనా ఆ కరోనా మహమ్మారితో సహజీవనం చేసేందుకు రెడీ అవ్వక తప్పదేమో అన్నట్లుగా ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వృద్ధులను, వైద్యా వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా జీరో కోవిడ్‌ పాలసీ విధానాన్ని రెట్టింపు చేస్తానని చెప్పడం గమనార్హం.

(చదవండి: ఉప్పెనల విరుచుకుపడుతున్న ఉక్రెయిన్‌ దళాలు... ఆవిరై పోతున్న రష్యా ఆశ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top