ఫేస్‌బుక్‌ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు

Discussed Situation With PM Modi  Says Australian PM Amid Facebook Row - Sakshi

సిడ్ని: గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్‌ సంస్థ ఫేస్‌బుక్‌ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌లోని  ఫేస్‌బుక్‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది. దీనిపై ఒ‍క్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ  చర్చలకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్‌ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు.

కాగా, ‘ఫేస్‌బుక్‌ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు.  ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్‌ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్‌బుక్‌ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్‌ మీడియా అవుట్‌ లేట్‌లను, కొత్తకంటెంట్‌ను కనబడకుండా నిరోధించారని ఫేస్‌బుక్‌ కోశాధికారి ఫైడెన్‌బర్గ్‌ తెలిపారు. ఆసీస్‌ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్‌ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్‌ కంటేంట్‌ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు.

ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్‌ ట్రూడోతో చర్చించామని ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్‌ కార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ మైఖేల్‌ మిల్లర్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్‌ కోరారు.

ఇక్కడ చదవండి: ఫేస్‌బుక్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top