పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

మంగపేట: మండల పరిధి మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement