సంకటహరచతుర్థి పూజలు | - | Sakshi
Sakshi News home page

సంకటహరచతుర్థి పూజలు

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

సంకటహరచతుర్థి పూజలు నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ కేన్‌ మొక్కలను సంరక్షించాలి శిథిల దశ.. ఇవ్వరా భరోసా?

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌, శ్రవణ్‌ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశపుహాల్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభయమ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

వెంకటాపురం(ఎం): కేన్‌ మొక్కలను సంరక్షించాలని కేన్‌ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్‌ సుతారి సతీష్‌ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధి పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్‌ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్‌ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్‌ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్‌ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్‌ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్‌ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్‌ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్‌ కొట్టి చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్‌ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్‌ కోరారు.

కాజీపేట అర్బన్‌: కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో 12 ఏళ్ల క్రితం 3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్‌ ట్యాంకు శిథిల దశకు చేరుకుంది. రాజీవ్‌ గృహకల్ప సముదాయంలోని 16 బ్లాకులు, 512 క్వాటర్స్‌లో నివాసం ఉండే ప్రజలకు నిత్యం తాగునీరందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ట్యాంకు చుట్టూ రంధ్రాలు ఏర్పడి నీరు లీకవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని రాజీవ్‌ గృహకల్ప వాసులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని వాటర్‌ ట్యాంకుకు మరమ్మతులు చేయాలని, లేకపోతే నూతన ట్యాంకు నిర్మించి ఇవ్వాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement