సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

– 8లోu క్యూఆర్‌ కోడ్‌ పేరుతో దందా స్టిక్కరేసి.. నొక్కేసి!

న్యూస్‌రీల్‌

స్టిక్కర్లకు లెక్క ఉందా?

లారీ ఓనర్లకు అదనపు భారం

లారీకి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు

చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్‌ సిబ్బంది

ఖిలా వరంగల్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు అతికించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి వెళ రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాహనదారులు గుర్తించే వీలుంటుంది. కాగా, సాధారణ స్టిక్కర్ల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్లు వేయాలని దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్ప డుతుండడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు

బాధ్యతల అప్పగింత..

వాహనాలకు క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది లారీలతోపాటు ఇతర వాహనాలకు క్యూ ఆర్‌ కోడ్‌ కలిగిన రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మార్చి 25న ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను లారీకి అంటిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల వరకు, అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6,500 వసూలు చేయడంతో ఓనర్లపై అదనపు భారం పడుతోంది.

బిల్లులివ్వరు..

ఇంతకాలం ఫిట్‌నెస్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే లారీకి రూ.300ల నుంచి రూ.500లోపు వసూలు చేసి రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు వేసేవారు. ప్రస్తుతం లారీలకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ వేసి బిల్లు చేతిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్‌ వేస్తే ఫిట్‌నెస్‌ క్రమ బద్ధీకరణ కోసం కార్యాలయానికి వచ్చే వాహనాలకు మొదట స్టిక్కర్లు వేసిన తర్వాతే అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. స్టిక్కర్ల సైజు ఎంత..? వసూలు చేసిన మొత్తం? సంబంధిత వివరాలతో కూడిన బిల్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తుండడంతో శనివారం లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు రూ. 500లోపు ఖర్చయ్యేదని, ఇప్పుడు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన బిల్లువ్వడం లేదని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌ ఆరోపించారు.

వాస్తవానికి వాహనానికి ఎంత సైజులో స్టిక్కర్‌ వేస్తారు? ఏ వాహనానికి ఎంత చెల్లించాలి. తదితర వివరాలతో కాంట్రాక్టర్‌ కార్యాలయంలో ఫ్లెక్సీలు ప్రదర్శించాలి. అవేమీ లేకుండానే వసూళ్లకు పాల్పడడంతో కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది అడిగినంత చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. స్టిక్కర్లు వేయడానికి వసూలు చేసే డబ్బుతో రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకపోయినా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈవిషయమై జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్‌ బాబును వివరణ కోరగా.. తీసుకున్న డబ్బుకు బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్లు ఇవ్వకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించవద్దని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement