రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కాశిబుగ్గ: మహిళలు ఆర్థిక స్థోమత పెంచుకోవడానికి కుట్టు శిక్షణలో నైపుణ్యం సంపాదించుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ సౌజన్యంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాగా, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డు నుంచి నూతన కారులో మంత్రి సురేఖను ఊరేగింపుగా తీసుకొచ్చేందుకు కార్యకర్తలు యత్నించారు. కానీ, ఆమే స్వయంగా కుట్టు శిక్షణ కేంద్రం వరకు కారు నడిపి ఆకట్టుకున్నారు. నాయకులు గోపాల్ నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు మడూరి గణేశ్, సెక్రటరీ పొన్న హరినాఽథ్, జూలూరు కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ బేతి అశోక్‌బాబు, రత్నాకర్, వినయ్, కిరణ్, వేణు, కోశాఽధికారి కుమార ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు దామెర రాజ్ కమల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెరువుల పునరుద్ధరణనే ప్రభుత్వ లక్ష్యం
ఖిలా వరంగల్: చెరువుల పునరుద్ధరణనే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువును, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువుల పునరుద్ధరణకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద రూ. 6కోట్ల వ్యయంతో చిన్నవడ్డేపల్లి, రంగసముద్రం చెరువుల పునరుద్ధ్దరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మండల తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, కాంగ్రెస్ నా యకులు గోపాల నవీన్‌రాజా, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్లు సు రేశ్, మరుపల్ల రవి పాల్గొన్నారు.


