వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

హన్మకొండ అర్బన్‌ : వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని 108 ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ పి.శివకుమార్‌ అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా 108 ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని సన్‌స్ట్రోక్‌, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వేగంగా స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. కాగా, శివకుమార్‌ జన్మదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా 108 ఉద్యోగులు ఆయనకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం మేనేజర్లు శ్రీనివాస్‌, భరత్‌, రాజ్‌కుమార్‌, రాజు నాయక్‌, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లకావత్‌ బాలాజీ నాయక్‌, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి దేవేందర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్‌ శివకుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement