జాతరను సక్సెస్ చేద్దాం..
వరంగల్ క్రైం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్ చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు సీపీ సన్‌ప్రీత్ సింగ్ పోలీస్, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం కమిషనరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు మేడారం వస్తున్న భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సమస్యలు సృష్టించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవద్దని, డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. హనుమకొండ బాలసముద్రం నుంచి జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, ఆర్టీసీ, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్‌రెడ్డి, జానీ నర్సింహులు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంలు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు రవిచందర్, అర్పిత,ఽ ధర్మాసింగ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, ఇతర పోలీస్, ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ సన్ ప్రీత్ సింగ్
ఆర్టీసీ, పోలీసు అధికారులతో
సమావేశం


