ఎస్సీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలోని అర్హులైన ప్రతీ ఎస్సీ విద్యార్థి ప్రీ మెట్రిక్ పథకం ద్వారా లబ్ధి జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్‌పై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు పాల్గొన్నారు.
బాలికల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత కీలకం
కాళోజీ సెంటర్: కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లుగా పనిచేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఓ గొప్ప సేవ అని, బాలికల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కీలక బాధ్యత అని వరంగల్ కలెక్టర్ సత్యశారద గుర్తుచేశారు. హనుమకొండ నక్కలగుట్ట హరిత హోటల్‌లో శుక్రవారం జరిగిన వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీ వార్డెన్ల సాధికారత శిక్షణ ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు, వరంగల్ జీసీడీఓ కె.ఫ్లోరిన్స్, హనుమకొండ జీసీడీఓ ఎం.సునీత, మాస్టర్ ట్రైనర్, కరీంనగర్ జీసీడీఓ కృపారాణి, జ్యోతి, సరస్వతి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.


