ప్రహరీ కూల్చివేత
వరంగల్ చౌరస్తా: వరంగల్ తూర్పులో ఓ అధికార పార్టీ నాయకుడు, విల్లా అసోసియేషన్ ప్రతినిధులు తమ పంతం నెగ్గించుకున్నారు. నిబంధనలకు తూ ట్లు పొడుస్తూ సోమవారం అత్యంత ప్రమాదకరమైన ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చేసి, గేట్ ఏ ర్పాటు చేశారు. ఆజంజాహీ మిల్లు మూతపడడంతో ఆస్థలంలోని 32.69 ఎకరాలను రాంకీ విల్లా ఇన్ ఫ్రా కొనుగోలు చేసి 239 విల్లాలను నిర్మించి విక్రయించారు. ఒప్పందంలో భాగంగా కొంత భాగాన్ని హౌజింగ్ బోర్డుకు కేటాయించారు. ఆ స్థలంలో జీ ప్లస్2 పద్ధతిలో భవనాలను 102 ప్లాట్లుగా హౌజింగ్ బోర్డు నిర్మించింది. వాటి అమ్మకానికి నోటిఫికేషన్‌ను తాజాగా జారీ చేసింది.
నిబంధనలు తూచ్..
రాంకీ విల్లాస్‌లో ప్లాట్లను సంపన్నులు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. హౌజింగ్ బోర్డు నిర్మించి.. జీ–ప్లస్–2 భవనాలకు రాంకీ ప్రధాన రహదారి నుంచి రాకపోకలు సాగేలా రోడు నిర్మించారు. సంపన్నులు నివాసం ఉండే కాలనీలోకి హౌజింగ్ బోర్డు రహదారి నిర్మించడంపై ఓ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విల్లాస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీని కలిసి విన్నవించగా.. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించగా, అదే రోజు హౌజింగ్ బోర్డు రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశంతో కూల్చేశారు. తాజాగా హౌసింగ్ బోర్డు జీ ప్లస్–2 ప్లాట్స్‌ను అల్పాదాయ వర్గాలకు లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తామని నోటిఫికేషన్ జారీ చేశారు. విష యం తెలుసుకున్న నాయకుడు మరోమారు జిల్లా కు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇంధన డిపో వైపు ప్రహరీ కూల్చి భారీ గేట్ ఏర్పాటు చేశారు. ఇక హౌసింగ్ బోర్డు ప్లాట్స్ నివాసితులు అటువైపుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుందని కాలనీవాసులకు ధీమా కల్పించారు. వీరు త్వరలో రాంకీ విల్లాస్ వైపు నడిచేందుకు వీలు లేకుండా ప్రహరీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై హౌసింగ్ బోర్డు అధికారులను వివరణ కోరితే తమకు సమాచారం లేదని దాటవేయడం గమనార్హం.
ఇంధన డిపో వైపు గేట్ ఏర్పాటు
ఇదెక్కడి దౌర్జన్యం అంటున్న రాజకీయ పార్టీల నేతలు


