మా చిట్టి డబ్బులు ఇప్పించండి
కాజీపేట అర్బన్: మా చిట్టి డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చిట్స్ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్‌ఫండ్ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. తొలుత కనకదుర్గ చిట్‌ఫండ్ బాధితుల్లోని 37 గ్రూపుల్లో 25 మందికి 3 కోట్ల రూపాయల ఎఫ్‌డీలను జాయింట్ అకౌంట్ జిల్లా రిజిస్ట్రార్, కనకదుర్గ చిట్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి అందజేసిన విషయం విదితమే. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ, శుభనందిని చిట్స్ బాధితులు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చేరుకుని ఫిర్యాదులు అందించారు. తాము పూర్తిగా చిట్టి డబ్బులు చెల్లించాం.. డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్‌ను వేడుకున్నారు. డీఐజీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదుల వెల్లువ


