మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

Dec 19 2025 9:26 AM | Updated on Dec 19 2025 9:26 AM

మహాజా

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క– సారలమ్మ మహజాతరకు కేంద్ర మంత్రులు జువల్‌ ఓరం, కిషన్‌రెడ్డిని బీజేపీ జిల్లా నా యకులు ఆహ్వానించారు. గురువారం ఆదిలా బాద్‌ ఎంపీ గోడం నాగేశ్‌ ఆధ్వర్యంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్‌, నాయకులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్‌ ఓరం, మైనింగ్‌ శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భరతపురం నరేశ్‌, పోదెం రవీందర్‌, సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.

బైక్‌ను ఢీకొన్న బొలెరో

యువకుడి మృతి,

మరొకరి పరిస్థితి విషమం

కాటారం: కాటారం మండలం గంగారం ఎక్స్‌ రోడ్డు కొండంపేట క్రాస్‌ వద్ద బొలెరో.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడు మృతి చెందగా మరొ కరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం కొండంపేటకు చెందిన శనిగరం రాఘవ, వలెంకుంటకు చెందిన మంతెన గణేశ్‌(20) గురువారం బైక్‌పై గంగారం ఎక్స్‌ రోడ్డు వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో మంథని వైపునకు వెళ్తున్న బొలెరో కొండంపేట క్రాస్‌ దాటుతున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న రాఘవ, గణేశ్‌ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గణేశ్‌ చికిత్స పొందుతూ మృతి చెందగా రాఘవ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి

రైల్వే రక్షక దళం అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సుభాష్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే రక్షక దళం విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కొనసాగించేలా కృషి చేయాలని రైల్వే రక్షక దళం అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ సుభాష్‌ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి మహబూబాబాద్‌ రైల్వే స్టేష న్‌ పరిధిలోని రైల్వే రక్షక దళం ఔట్‌ పోస్టు వి భాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే భద్రతాపరమైన విషయాలపై అధికారులు, సి బ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ పరిధిలో చో రీలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తనిఖీల్లో కాజీపేట ఆర్పీఎఫ్‌ సీఐ చటర్జీ, మానుకోట ఆర్పీఎఫ్‌ ఎస్సై సుభాని, సిబ్బంది ప ద్మ, జయపా ల్‌, శ్రీను, క న్న,శిరీష పా ల్గొన్నారు.

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
1
1/3

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
2
2/3

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
3
3/3

మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement