21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు | - | Sakshi
Sakshi News home page

21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు

Dec 19 2025 9:26 AM | Updated on Dec 19 2025 9:26 AM

21న జిల్లా స్థాయి  చదరంగ పోటీలు

21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: కమల్‌ కింగ్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాఠశాల స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్‌ జి.రాంప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలో గల టీటీడీ కల్యాణ మండపంలో అండర్‌ –07, 09, 11, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు పురస్కారంతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్‌ ఇతర పూర్తి వివరాలకు 9676056744 , 9154570257 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

నేటి నుంచి టెమ్రిస్‌ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో నేటి(శుక్రవారం) నుంచి మూడో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయని గురుకులాల ఆర్‌ఎల్‌సీ, క్రీడా పోటీల రీజినల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ జంగా సతీశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధి ఆరు జిల్లాలలోని బాల, బాలికల గురుకులాల క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలురకు వరంగల్‌ రంగశాయిపేటలోని వరంగల్‌(బీ1) గురుకులంలో, బాలికలకు శంభునిపేట దూపకుంటరోడ్‌లోని వరంగల్‌(జీ2) గురుకులంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

కేయూలో లాన్‌ టెన్నిస్‌

ఎంపికలు

కేయూ క్యాంపస్‌: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులకు గురువారం లాన్‌ టెన్నిస్‌ ఎంపికలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ బోర్డు ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు 30 మంది హాజరయ్యారు. ఇందులో ఐదుగురు మెన్‌, మరో ఐదుగురు ఉమెన్స్‌ మొత్తం 10 మందిని ఎంపిక చేశామని కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వీరు సౌత్‌జోన్‌ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు.

కేయూలో అంతర్‌ కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీలు

నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహణ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు ఈనెల 19 , 20వ తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో షార్ట్‌రన్స్‌, మిడిల్‌ రన్స్‌, లాంగ్‌రన్స్‌ 400, 4 ్ఠ400 మీటర్ల రిలే పరుగు పందెం పోటీలు నిర్వహించబోతున్నారు.లాంగ్‌ జంప్‌, హైజంప్‌, హ్యామర్‌త్రో, షార్ట్‌పుట్‌, జావెలిన్‌త్రో విభాగాల్లో పురుషుల, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడాపోటీలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ప్రారంభిస్తారని కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ,ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎస్‌. కుమారస్వామి గురువారం తెలిపారు. ఈనెల 20 ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, యూనివర్సిటీకాలేజీ ప్రిన్సిపాల్‌ టి. మనోహర్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement