దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం
హన్మకొండ: కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి.శ్రీనివాస్‌రావు, మహిళా కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా సోనియాగాంధీ, రాహుల్ గాంధీని వేధింపులకు గురి చేయడంపై కాంగ్రెస్ పార్టీ గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తుండగా నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్యాల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్ట్ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయ శ్రీ రజాలీ, మామిండ్ల రాజు, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, అంకుష్, నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్, విక్రమ్, గుంటి స్వప్న, సమత, నసీం జా, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ బీజేపీ కార్యాలయ ముట్టడి
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయాన్ని గు రువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ముట్ట డించారు. వరంగల్ నగరంతోపాటు గీసుకొండ మండలం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ జెండాలతో తరలివచ్చి బీజేపీ కార్యాలయానికి వెళ్లేదారిలో ధర్నా చేశారు. పరకాల ఎ మ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నా గరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు అయూబ్ ధర్నాలో పాల్గొన్నారు. బీ జేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్‌రెడ్డి వాహనంలో వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీ జేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. మామునూ రు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్ పోలీసు వాహనా ల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్య నాయకులను గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు బంక సరళ
నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా
కాంగ్రెస్ నిరసన ర్యాలీ
దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం


