క్రీస్తు దీవెనలు ఉండాలి
కాజీపేట రూరల్: సర్వమానవాళి రక్షకుడు ఏసుక్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఓరుగల్లు పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో శనివారం ఏసు క్రీస్తు జయంతి 2025, జూబ్లీ వేడుకలు కనులపండువగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ మాట్లాడుతూ.. రోమ్ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో.. సంవత్సరం పీఠస్థాయిలో, విచారణ, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ప్రకటించినట్లు తెలిపారు. ఈ జూబ్లీ వేడుకల్లో విశ్వాసులు ఏసుక్రీస్తు జన్మ రహస్యాన్ని ధ్యానిస్తూ జూబిలీ అంతరార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ఫాదర్ విజయపాల్ పూజ బలిని సమర్పించి జూబిలీ సందేశాన్ని అందించి ప్రజల కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో ఓరుగల్లు దైవాంకితులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి స్సైన్స్ ఫేర్, విద్యాసంవత్సరానికి మంజూరైన ఇన్‌స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌వీ.గిరిరాజ్‌గౌడ్, జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్పై ర్‌కు సంబంధించి మంజూరైన ప్రతీ విద్యార్థి ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌లో ఈవైజానిక ప్రదర్శనల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రకటించిన ఏడు ఇతివృత్తాల్లో ఏవైనా రెండింటికి సంబంధించిన జూనియర్ విభాగం నుంచి ఇద్దరు, సీనియర్ విభాగం నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులతో 4 ప్రదర్శనలకు అవకాశం ఉంది. కాగా, 15న సన్నాహక సమావేశాన్ని అదే స్కూల్‌లో నిర్వహించబోతున్నట్లు డీఈఓ తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలని సూచించారు.
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్‌లో సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన సుదర్శన్‌రెడ్డి, రవీంద్రచారి, యాదగిరి, కృష్ణమూర్తి, అజీదుద్దీన్, ఉప్పలయ్య, సారంగపాణి, రాజేశ్వరి సీపీని శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్లూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) మూడవ సెమిస్టర్ పరీక్షలు జనవరి 3వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3న మొదటి పేపర్, 5న రెండో పేపర్, 7న మూడవ పేపర్, 9న నాల్గవ పేపర్, 12న ఐదవ పేపర్, 16న ఆరవ పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్ల పరిశీలన
న్యూశాయంపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి, సంగెం, గీసుగొండ మండలాల్లోని 74 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సిద్ధం చేశారు. వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవితో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద శనివారం పరిశీలించారు.
క్రీస్తు దీవెనలు ఉండాలి


