బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి

Nov 4 2025 8:07 AM | Updated on Nov 4 2025 8:11 AM

కలెక్టర్‌ను కలిసిన ఎంజీఎం సూపరింటెండెంట్‌ టీబీ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్ల పంపిణీ

హన్మకొండ చౌరస్తా: హనుమకొండ రెడ్డి కాలనీలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి మార్చారు. నూతన భవనంలోకి మారిన డిస్పెన్సరీని ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డిస్పెన్సరీగా మారిన అంశాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నరేంద్ర, కళాశంకర్‌, కె.యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

కేయూ

ప్రైవేట్‌ కళాశాలల బంద్‌

కేయూ క్యాంపస్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిఽధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కళాశాలలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్‌ చేశారు. ఎక్కువశాతం ప్రైవేట్‌ కళాశాలలు ముందుగానే విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో కళాశాలలకు రాలేదు. అక్కడక్కడా వచ్చినా కళాశాలలు మూసివేసి ఉండడంతో విద్యార్థులు వెనుదిరిగారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది తమ నిరసన తెలిపారు.

న్యూశాయంపేట: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ పి.హరీశ్‌చంద్రారెడ్డి సోమవారం వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు.

విద్యార్థులు

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ ఈనెల మూడో వారం లేదా చివరి వారంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘ఎస్‌టీఈఎం –స్టెమ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌ అండ్‌ ఆత్మనిర్భర్‌’ భారత్‌ అనే ప్రధాన ఇతివృత్తంపై నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్‌ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికతలు, వినోద గణిత నమూనా, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ తదితర ఉప ఇతివృత్తాల్లోనూ ఎగ్జిబిట్లను ప్రదర్శించవచ్చు. జూనియర్‌ విభాగం నుంచి 6నుంచి 8వ తరగతి విద్యార్థులు రెండు, సీనియర్‌ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు రెండు చొప్పున గరిష్టంగా నాలుగు ఎగ్జిబిట్లను తీసుకురావాల్సి ఉంటుంది. విద్యార్థుల పేర్లను గూగుల్‌ ఫారంలో ఈనెల 6వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులకు సైన్స్‌ సెమినార్‌ కూడా నిర్వహించనున్నారు.

ఎంజీఎం: టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మనూస్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫర్‌ ఆర్ఫన్‌ చిల్డ్రన్‌ సంస్థ సహకారంతో టీబీ పేషెంట్లకు 40 నిక్షయ్‌ పోషణ కిట్లను డీఎంహెచ్‌ఓ అప్పయ్య పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధితో బాధపడే వారు సమయం ప్రకారం మందులు వేసుకోవాలని, అలాగే చక్కటి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ హిమబిందు, మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, మనూస్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫర్‌ అర్ఫన్‌ చిల్డ్రన్‌ సంస్థ ప్రతినిధి మహేశ్‌, జిల్లా టీబీ కో–ఆర్డినేటర్‌ నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి1
1/3

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి2
2/3

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి3
3/3

బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లోకి ఈఎస్‌ఐ ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement