గ్రీన్‌ఫీల్డ్ రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న నెక్కొండ మండలంలోని పత్తిపాక, వెంకటాపూర్ రైతులతో వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్‌లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ ఇంజనీరింగ్ అధికారి ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు.
ఈఆర్సీ చైర్మన్లను కలిసిన కలెక్టర్
నగర పర్యటనకు వచ్చిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు విశ్వజిత్‌ఖన్నా, అరవింద్‌కుమార్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.


