ఒక్కేసి పువ్వేసి.. చందమామ
● వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు
● భక్తిశ్రద్ధలతో నిమజ్జనం
ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ యువతులు, మహిళలు పాటలతో సందడి చేశారు పోయి రావమ్మ.. గౌరమ్మ అంటూ దీపావళి (నేతకాని) బతుకమ్మను సాగనంపారు. హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన దీపావళి(నేతకాని)బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, పురుషులు గ్రామ వీధులగుండా కిలోమీటర్ దూరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్, మాజీ ఎంపీటీసీ రజిత, స్థానికులు చేరాలు, రాజయ్య, గాంఽధీ పాల్గొన్నారు. – హసన్‌పర్తి


