
సాంకేతిక మహోత్సవానికి ఏర్పాట్లు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25న ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు నిట్ విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో ప్రారంభమైన టెక్నోజియాన్ టెక్నాలజీని పంచుకునేందుకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఈవేడుకకు దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 7 వేల మంది హాజరుకానున్నారు. టెక్నోజియాన్–25లో నిర్వహించే పోటీలకు రూ.2 లక్షలు బహుమతులు అందజేయనున్నారు. టెక్నోజియాన్–25లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ కోసం https:// technozion. nitw.ac.in/ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక టీం..
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ చీఫ్ ప్యాటరన్‌గా, .ప్యాటరన్స్‌గా డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్, స్యాక్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి, వెంకన్న ఉడుతలపల్లి, స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీలు సాయి వంశీ, కార్తీక్‌రెడ్డి, హర్ష, సమన్విత్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలు ధీరజ్, పవన్, అభిరామ్, వెబ్ టీం నితిన్, బి.రిషి, సాయిరుషిత్, అమన్, భరత్‌జౌన్‌తో కూడిన ప్రత్యేక టీం టెక్నోజియాన్–25ను ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో...
ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో సాంకేతిక మహోత్సవం ఈ ఏడాది కూడా ప్రత్యేక థీంతో ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు. కాగా 2022లో టెక్స్‌టేసీగా, 2023లో ఇంజీనియస్‌గా, 2024లో టెక్నోజియాన్‌గా ప్రత్యేక థీంతో ముందుకు సాగింది.
అలరించనున్న టెక్నోజియాన్–25..
టెక్నోజియాన్–25లో స్పాట్‌లైట్స్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, నియాన్ క్రికెట్, జహాజ్, హోవర్ మానియా, డ్రోన్ హంట్, హాకథాన్ వంటి 50కి పైగా ఈవెంట్స్‌తో పాటు సాంకేతిక విజ్ఞానాన్ని అందించనుంది.
ఈనెల 24, 25 తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్–25
హాజరుకానున్న 7 వేల మంది
ఇంజనీరింగ్ విద్యార్థులు
23న లాంఛనంగా ప్రారంభం