
గణేశ్ వైద్య విద్యకు కేటీఆర్ భరోసా
హన్మకొండ : హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేశ్ వైద్య విద్య ఖర్చును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భరిస్తారని ఆపార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భా స్కర్ అన్నారు. తల్లిదండ్రులు లేని గణేశ్‌కు ఎంబీబీఎస్‌లో సీటు రాగా, ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక ‘ఎక్స్’ ద్వారా సహాయం చేయాలని కోరగా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం హనుమకొండ బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన కా ర్యక్రమంలో గణేశ్‌కు వినయ్‌భాస్కర్ రూ.1.50 లక్షలు అందించారు. గణేశ్ ఎంబీబీఎస్ విద్య పూర్తయ్యే వరకు ఖర్చును కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అందిస్తుందన్నారు.
కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం వైన్స్ టెండర్లలో భాగంగా 7 దరఖాస్తులను మ ద్యం వ్యాపారులు అందజేశారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట ఎకై ్స జ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 67 వైన్స్‌కు ఇప్పటి వరకు 14 దరఖాస్తులు అందాయి.
హసన్‌పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్‌బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్‌లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు.
హన్మకొండ: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 7న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్‌ఎం కళాశాల, రంగశాయిపేట కూడలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మై మాస్టర్ స్కూల్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
హనుమకొండలో..
హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్స్ కాలనీ–1, బ్యాంక్ కాలనీ, చైతన్యపురి ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, కుమార్‌పల్లి, ఈద్గా, శ్యామల గార్డెన్స్, నాగరాజ దేవాలయం, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, కుమార్‌పల్లి మార్కెట్, తోటబడి, కొత్తూరు ప్రాంతంలో ఉదయం 11 నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు గుడిబండల్, ఎస్సీ హాస్టల్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, నయీంనగర్, లష్కర్ సింగారం, రాజాజీనగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

గణేశ్ వైద్య విద్యకు కేటీఆర్ భరోసా