
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ ఆరోపణలు
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య ‘‘బీఆర్‌ఎస్ కా ధోకా కార్డు’’ను విడుదల చేశారు. తెలంగాణలో పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏమేం హామీలను నెరవేర్చలేదో వాటిలో కొన్నింటిని ఆ కార్డులో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ప్రజలకు జీవితాంతం బాకీ ఉంటామనేది వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో 11 శాతం వ డ్డీపై అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్‌ఎస్ నేతలే ప్రజలకు అసలైన బాకీదారులని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్‌ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు మారుపేరుగా నిలిచిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గిన్నిస్ బుక్‌లో స్థానం కల్పించాలని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీ డర్ వెంకటేశ్వ ర్లు, కార్పొరేటర్లు రవీందర్, విజ యశ్రీ, కిసాన్‌సెల్ జిల్లా చైర్మన్ వెంకట్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య
హనుమకొండలో ‘బీఆర్‌ఎస్ కా ధోకా కార్డు’ విడుదల