
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
వరంగల్ చౌరస్తా : కేంద్ర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ సూచించారు. శనివారం వరంగల్ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై జరిగిన సమావేశంలో ఆనంద్ గౌడ్ మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్నీ సీట్లల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అరూరి రమేష్ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశాన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్లే వన్నాల శ్రీరాములు, నాయకులు వంగాల సమ్మిరెడ్డి, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ పాల్గొన్నారు.